TG: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. పలు రెస్టారెంట్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కాచిగూడలోని అరేబియన్ మండీ హౌస్, మెహఫిల్ బిర్యానీ దర్బార్ రెస్టారెంట్లో తనిఖీలు చేపట్టారు. అపరిశుభ్ర వాతావరణంలో వంటకాలు తయారీ, హానికర సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపినట్లు కనిపెట్టారు. ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. రెస్టారెంట్ నిర్వాహకులకు నోటీసులు జారీ, కేసు నమోదు చేశారు.