ఉన్నట్టుండి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. లేటెస్ట్ ఫిల్మ్ భోళా శంకర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్‌గా తెరకెక్కుతోంది భోళాశంకర్. కీర్తి సురేష్ చిరు చెల్లెలిగా నటిస్తుండగా.. తమన్నా చిరుకి జోడిగా నటిస్తోంది. సుశాంత్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. మందుగా ఈ సినిమాను సమ్మర్లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఫైనల్‌గా ఆగష్టు 11న రిలీజ్ చేయబోతున్నట్లు ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇప్పటికే ఆగష్టు 11న మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న SSMB 28ని రిలీజ్ చేస్తామని నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. కానీ ఇప్పుడు మెగాస్టార్ ఆ డేట్‌ను లాక్ చేసుకున్నారు. దాంతో మెగా, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాస్త కన్ఫ్యుజన్లో పడిపోయారు. చిరు వస్తున్నాడంటే.. మహేష్ సినిమా వాయిదా పడినట్టేనా.. భోళా శంకర్ టీమ్ ఎస్ఎస్ఎంబీ 28 టీమ్‌ని సంప్రదించే డేట్ లాక్ చేశారా.. లేదంటే కావాలనే ఇలా చేశారా.. తెలియకుండా జరిగిందా.. అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మహేష్ సినిమా ఆగష్టులో రావడం లేదని.. దసరా లేదా సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్టు ఈ మధ్య వార్తలొస్తున్నాయి. ఇప్పుడు భోళాశంకర్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో.. దాదాపు ఎస్ఎస్ఎంబీ వాయిదా పడినట్టేనని అంటున్నారు. లేదంటే.. బాక్సాఫీస్ వార్ మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్‌గా ఫిక్స్ అయినట్టే. అయితే శ్రీరామనవమికి మహేష్ సినిమా నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రాబోతోంది.. ఆరోజే రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ రానుంది.