AP: తిరుమలలో 2025 మార్చి నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ద్వారా సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన ఆర్జిత సేవా టికెట్ల కోటాను రిలీజ్ చేయనుంది. 24వ తేదీన రూ.300 టికెట్లు, అద్దె గదులు బుక్ చేసుకోవచ్చు. 27న శ్రీవారి సేవా కోటా టికెట్లు విడుదలకానున్నాయి.