కర్ణాటకలో వృక్షప్రేమికురాలు తులసిగౌడ మృతి చెందారు. ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హున్నళ్లికి చెందిన తులసిగౌడ వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. 17 ఏళ్ల పాటు ఆమె అటవీశాఖలో దినసరి కూలీ పనిచేశారు. మొక్కలు నాటితే చాలదు, వాటిని అలాగే సంరక్షించుకోవాలని తెలిపారు. పచ్చదనాన్ని పెంచటం కోసం ఆమె సుమారు 30 వేల మొక్కలను నాటారు. ఆమె చేసిన సేవలకు గాను తులసిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.