TG: అమెరికాలో అదానీపై కేసు, మణిపూర్ అల్లర్లపై పీఎం మోదీ వైఖరిని నిరసిస్తూ టీపీసీసీ ఈరోజు ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఉ.11 గం.లకు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా విగ్రహం నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు.