»First Time In 75 Years Kejriwal Writes To Pm Modi After Centre Halts Delhi Budget
Kejriwal : 70ఏళ్లలో ఇలా ఎప్పుడూ జరగలేదు.. మోదీకి కేజ్రీవాల్ లేఖ
Kejriwal : ప్రధాని నరేంద్రమోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాశారు. రాష్ట్ర బడ్జెట్ నిలిపివేయడం పై కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. 75 ఏండ్ల చరిత్రలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టకుండా నిలిపివేయం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా కేంద్రం అడ్డుకుంటోందని ఆయన లేఖలో ఆరోపించారు.
ప్రధాని నరేంద్రమోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాశారు. రాష్ట్ర బడ్జెట్ నిలిపివేయడం పై కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. 75 ఏండ్ల చరిత్రలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టకుండా నిలిపివేయం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా కేంద్రం అడ్డుకుంటోందని ఆయన లేఖలో ఆరోపించారు. ఢిల్లీ ప్రజలంటే మీకు ఎందుకంత కోపం అంటూ ఆయన ప్రశ్నించారు. బడ్జెట్ ఆమోదించాలని ఢిల్లీ ప్రజలు చేతులు జోడించి వేడుకుంటున్నారంటూ తెలిపారు. ఇప్పటికైనా బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన లేఖలో కోరారు.
షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ అసెంబ్లీలో ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ మౌలిక సదుపాయాల కంటే ఎక్కువగా ప్రకటనల కోసం ఎందుకు ఖర్చవుతుందో తెలపాలని బడ్జెట్ ప్రజెంటేషన్‌ను క్లియర్ చేయడానికి ముందు కేంద్రం ఆప్ సర్కార్ నుంచి వివరణ కోరింది.
ఈ క్రమంలో ప్రధాని మోడీకి కేజ్రీవాల్ లేఖ రాశారు. ఓ జాతీయ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతున్న వీడియోను ఆప్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ రోజు ఢిల్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం లేదని వీడియోలో కేజ్రీవాల్ చెప్పారు. కేంద్ర సర్కార్ గూండాగిరి చేస్తోందని ఆయన మండిపడ్డారు.