VZM: షెడ్యూల్ కులాల వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమీషన్ రాజీవ్ రంజాన్ మిశ్రాను జెడ్పీ అతిథిగృహం వద్ద సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కలిశారు. ముందుగా కమిషన్కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం కమీషన్ రంజన్ మిశ్రాతో సమావేశమై, జిల్లా పరిస్థితిని కలెక్టర్ వివరించారు.