సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ‘పుష్ప-2 ప్రీమియర్ షోకు హీరో, హీరోయిన్, చిత్ర యూనిట్ వస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం అనుమతి కోరగా.. క్రౌడ్ విపరీతంగా ఉందని వారు రావొద్దని పోలీసులు రాత పూర్వకంగా సమాచారం ఇచ్చారు. అనుమతి లేకుండా అల్లు అర్జున్ ర్యాలీ చేపట్టారు. రేవతి మృతి తర్వాత కూడా కారు ఎక్కి ర్యాలీగా అభిమానులకు హీరో అభివాదం తెలిపాడు’ అని పీపీ బన్నీ రిమాండ్ వాదనల సమయంలో కోర్టుకు చెప్పాడు.