JGL: కొడుకు అన్నం పెడతలేడని వృద్ధ తల్లిదండ్రులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని గోవింద్ పల్లికి చెందిన ముల్లె నారాయణ, రాజవ్వ అనే దంపతులు సోమవారం జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ సత్య ప్రసాద్‌కు తమ గోస చెప్పుకున్నారు. తమ పేరుపై ఉన్న 57 గుంటల భూమిని కొడుకు తీసుకుని నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడని, తమకు ఇక చావే శరణ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు.