HYD: సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈరోజు ఉదయం మెట్టుగూడ, ఆలుగడ్డబావి వద్ద డీజిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో ఈ సమస్య తలెత్తింది. తార్నాక నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ప్యాట్నీ నుంచి సంగీత్, మెట్టుగూడ వరకు, గాంధీ ఆసుపత్రి నుంచి చిలకలగూడా X రోడ్డు వరకు ట్రాఫిక్ జామ్ అయింది.