సినీ నటుడు అడివి శేష్ తదుపరి సినిమాపై సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ‘తనని కాపాడినా.. కానీ ఒదిలేసింది.. తను ఏంటో.. అసలెవరో రేపు తెలుస్తుంది.’ అంటూ ఓ పోస్టర్ను తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. తను ఎవరో ప్రపంచానికి రేపు ఉదయం 11 గంటలకు పరిచయం చేస్తానని తెలిపాడు. గతంలో ఆమె శృతిహాసన్ అని ప్రకటించగా.. తాజా పోస్టర్లో కొత్త ముఖం కనిపిస్తుండటంతో ఆమె ఎవరని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.