AP: శ్రీకాకుళం పలాసలో టీడీపీ నేత హత్యకు కుట్ర జరగడంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వైసీపీ నేతలు ఐదేళ్లపాటు హత్యా రాజకీయాలు ప్రోత్సహించారని అని ఆరోపించారు. అధికారం కోల్పోయినా అదే పద్ధతి కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. కుట్ర వెనుక ఎంతటివారున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.