రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని ప్రజలకు ఢిల్లీ సీఎం అతిషి సూచించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి పేరిట పేదల ఆవాలను, ఓట్లను తొలగిస్తారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నందుకు ప్రజలను ఆకర్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తారని.. కావున ప్రజలు బీజేపీతో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. బీజేపీ కనుక అధికారం చేపడితే ఢిల్లీలో గూండాలు రాజ్యమేలుతారని, కావున ఆ పార్టీకి ఓటు వేయవద్దని ప్రజలను కోరారు.