TG: రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతోందని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. లగచర్ల రైతులు భూములు ఇవ్వబోమంటే జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. లగచర్ల ఘటనపై సభలో చర్చ పెట్టమంటే పారిపోయారంటూ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ సోదరుల కనుసన్నల్లో పోలీసులు పని చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వమా? అరాచక ప్రభుత్వమా? అని అడిగారు.