AP: మద్యం మత్తులో బ్లేడుతో దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా పెడన పట్టణంలో జరిగింది.పేరిశెట్టి చరణ్ అనే యువకుడు నిన్న మద్యం మత్తులో అదే గ్రామానికి చెందిన బెనర్జీ, శివలపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో వీరిద్దరూ గాయపడ్డారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.