ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ ‘కవాసకి’ తమ వాహనాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. నింజా 500 కొనుగోలుపై రూ.15 వేలు, నింజా 650 బైక్ కొనుగోలుపై రూ.45 వేలు తగ్గింపు ప్రకటించింది. ఈ తగ్గింపు ఈనెల 31వ తేదీ వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. 2024 సంవత్సరం ముగుస్తుండటంతో ప్రముఖ వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది.