ప్రముఖ హీరోయిన్ నివేదా థామస్, విశ్వదేవ్ కాంబోలో డైరెక్టర్ నందకిషోర్ ఈమని తెరకెక్కించిన ’35 చిన్న కథ కాదు’ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా TVలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జీ తెలుగులో ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలకు ఇది టెలికాస్ట్ కానుంది. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.