NLR: మనుబోలు మండల కేంద్రమైన మనుబోలు పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదిమందికి పైగా గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా పలమనేరు వాసులు ఓ టూరిస్ట్ బస్సులో తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి సొంత ఊరికి వెళుతుండగా ముందు వెళ్తున్న వాహనం ఆగడంతో బస్ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు. దీంతో నెల్లూరు నుంచి చెన్నై వెళ్తున్న లారీ వేగంగా ఢీ కొట్టింది.