కన్న తల్లిదండ్రులను కుమారుడు అతి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం బాపట్ల మండలంలో చోటుచేసుకుంది. అప్పికట్లలో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు విజయ భాస్కరరావు దంపతులు జీవిస్తున్నారు. గత అర్థరాత్రి సమయంలో ఈ దంపతులపై వారి కుమారుడు బలమైన ఆయుధంతో దాడి చేసి చంపేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు పట్టించారు. అయితే ఈ హత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.