MDK: గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో గురువారం ఆలయం హుండీ లెక్కింపు నిర్వహించారు. సంగారెడ్డి డివిజనల్ ఇన్స్పెక్టర్ రంగారావు ఆధ్వర్యంలో హుండీని లెక్కంచగా 78 రోజుల హుండీ ఆదాయం రూ.15,35,063 వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శశిధర్ గుప్తా, భ్రమరాంబ సేవా సమితి వారు సభ్యులు నాయకులు ప్రతాప్ రెడ్డి, లక్ష్మీనారాయణ ఉన్నారు.