ATP: కదిరిలో డిగ్రీ కళాశాల పక్కన ఉన్న గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థలకు రోజు పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డెక్కారు. STSN డిగ్రీ కాలేజీ వద్ద రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులకు AISP నాయకులు మద్దతుగా నిలిచారు. నాయకుడు నరసింహ మాట్లాడుతూ.. విద్యార్థుల పట్ల చులకనగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.