కృష్ణా: చాట్రాయి మండలం కోటపాడు ఎంపీయూపీ స్కూల్లో మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిది. విద్యార్థుల తల్లిదండ్రుల వివరాల మేరకు.. బుధవారం మధ్యాహ్నం పాఠశాలలో విద్యార్థులు భోజనం తిన్న తర్వాత 9 మంది తీవ్ర కడుపునొప్పికి గురయ్యారు. అనంతరం వారిని స్థానిక పీహెచ్సీకి తరలించారు.