కృష్ణా: మల్లవల్లి పారిశ్రామిక వాడలో 400 కంపెనీలు ప్రారంభించడం ఖాయమని ఎమ్మెల్యే యార్లగడ్డ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో 30 వేల ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చెప్పారన్నారు. ఎయిర్ పోర్డు, రైల్వే స్టేషన్, బందరు పోర్టుకు దగ్గరలో ఉన్న ఏకైక పారిశ్రామిక వాడ ఇదేనన్నారు.