ATP: గుంతకల్లు పట్టణంలో హనుమత్ వ్రత్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆంజనేయస్వామి దీక్షాపరులు గురువారం పట్టణంలోని హనుమాన్ సర్కిల్ నుండి కసాపురం ఆంజనేయస్వామి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో కొలువు తీర్చి పురవీధుల గుండా ఊరేగింపు చేశారు.