AP: టీటీడీ నూతన పాలక వర్గం నూతన పాలక వర్గం పలు సంస్కరణలు, నిబంధనలు అమల్లోకి తీసుకొస్తోంది. డ్యూటీలో ఉన్న ఉద్యోగులు నేమ్ ప్లేట్తో ఉన్న బ్యాడ్జీని ధరించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. బ్యాడ్జీని ధరించడం ద్వారా భక్తులతో దురుసుగా ప్రవర్తించే అధికారుల పేరు తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ఈ నెల 24 ఆమోదించి అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.