ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం హనుమాత్ వ్రత్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి మాలాదారులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముందుగా స్వామివారి మూలమూర్తికి వేకువజామున సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.