ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లా త్వరలోనే భారత్లో అడుగుపెట్టబోతుంది. ఢిల్లీలో షోరూం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. షోరూం ఏర్పాటుకు అనువైన స్థలం కోసం ఢిల్లీలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలతో సంప్రదింపులు చేస్తున్నారట. కాగా, భారత్లో ఎలాన్ మస్క్ రూ.25వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారని ఈ ఏడాది ప్రారంభంలో వార్తలు వచ్చాయి.