KDP: రైతులు ఈనెల 15లోపు పంటల బీమా ప్రీమియం చెల్లించాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి నాగేశ్వరరావు అన్నారు. చింతకొమ్మదిన్నె మండలంలోని బుగ్గలపల్లె, బోడెద్దులపల్లె గ్రామాల్లో బుధవారం జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వరి పంటకు ఈనెల 31 వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించుటకు అవకాశం ఉందని, మిగిలిన పంటలకు 15 లోపు ప్రీమియం చెల్లించాలన్నారు.