శబరిమల ఆలయానికి అయ్యప్ప స్వాముల రద్దీ పెరిగింది. కార్తీకమాసం పూర్తి అవడంతో మాలలు విరమించుకునేందుకు అయ్యప్ప స్వాములు శబరిమలకు చేరుకుంటున్నారు. దీంతో స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో పంబ నుంచి సన్నిధానం వరకు స్వాములు క్యూలైన్లలో వేచి ఉంటున్నారు.