GNTR: వినుకొండ పట్టణంలో ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐక్య సెమీ క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర చీఫ్ విప్ ఆంజనేయులు హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, కేక్ కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. పేదల అభ్యున్నతికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జీవి పేర్కొన్నారు. వినుకొండ పాస్టర్స్ కాలనీ ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు.