ATP: బొమ్మనహాల్ మండలంలో ఈనెల 14న సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తహశీల్దార్ మునివేలు అన్నారు. బొమ్మనహాల్లోని వెలుగు కార్యాలయంలో బుధవారం పీఓలు, ఏపీఓలతో సమావేశం నిర్వహించారు. సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలన్నారు.