బంగ్లాదేశ్‌లో బీఫ్ అందించని రెస్టారెంట్లను బ్యాన్ చేయాలంటూ ముస్లీం వినియోగదారుల హక్కుల మండలి భారీ ర్యాలీ చేపట్టింది. రెస్టారెంట్ల మెనూలో కచ్చితంగా బీఫ్ వంటకాలు చేర్చాలని పిలుపునిచ్చింది. కొన్ని రెస్టారెంట్లు బీఫ్‌ను బ్యాన్ చేస్తున్నాయని, అలాంటి వాటిని హిందుత్వ అనుకూలత రెస్టారెంట్లుగా భావించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆ తర్వాత దేశవ్యాప్త బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పింది.