AP: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలకు సన్నద్ధంకావాలని సూచించారు. అలాగే, విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.