AP: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను మంత్రి లోకేష్ విడుదల చేశారు. మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఒత్తిడి లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజు విడిచి రోజు పరీక్ష ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధించాలని సూచించారు.