SKLM: టెక్కలి మండలం బూరగాం గ్రామానికి చెందిన పుచ్చకాయల మోహన్ రెడ్డి బుధవారం ఉదయం మరణించారు. ఆయన అంత్యక్రియలలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మోహన్ రెడ్డి తనకు చిరకాల అభిమాని అని పేర్కొన్నారు. ఆయనతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.