TPT: ఏర్పేడు మండలం మోదుగుల పాల్యం గ్రామంలో చేతి పంపు నిరుపయోగంగా మారిందని స్థానికులు తెలిపారు. పోయిన వారం వచ్చిన తుఫాన్ ప్రభావంతో గ్రామంలో కరెంట్ సరఫరా ఆగిందని చెప్పారు. దీంతో గ్రామంలో నీటి కొరత బాగా ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ఈ చేతి పంపును మరమ్మత్తులు చేయించి వాడుకలోకి తీసుకురావాలని కోరుతున్నారు.