ఆర్బీఐ 26వ గవర్నర్‌గా ఇవాళ సంజయ్ మల్హోత్రా బాధ్యతలను స్వీకరించనున్నారు. సంజయ్ మూడేళ్ల పాటు ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగనున్నారు. తన 33 ఏళ్ల కెరీర్లో పవర్, టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రెవెన్యూ, ఆర్థిక, గనులు మొదలైన అనేక రంగాల్లో పని చేశారు. సంజయ్ రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ IAS అధికారి. ఐఐటీ కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు.