క్విక్ కామర్స్ విభాగంలోకి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అడుగుపెట్టబోతుంది. ఈ నెలాఖరులోగా క్విక్ కామర్స్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ముందుగా బెంగళూరులో సేవలను ప్రారంభించనున్నట్లు అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ వెల్లడించారు. ఈ సేవల కోసం 2వేల ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఇతర నగరాలకు కూడా ఈ సేవలను విస్తరించనున్నట్లు చెప్పారు.