CTR: ఎంబీయూ వద్ద పాత్రికేయులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ది మదనపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు డిమాండ్ చేశారు. వార్తల కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు దాడి చేసి గాయపరచడం దుర్మార్గపు చర్యగా అభిప్రాయపడ్డారు. ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్న వారిని ఉపేక్షించకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారు.