KKD: దాన్యం కొనుగోలులో రైతుల బిల్లులు చెల్లింపునకు సంబందించిన ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ (ఎఫ్డీవో)లను సకాలంలో అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన ఆదేశించారు. మంగళవారం సామర్లకోట మండలం ఉండూరు, వీకే రాయపురం గ్రామాల్లో రైస్ మిల్లులు, రైతు భరోసా కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు.