ELR: 10వ తరగతిలో ప్రణాళిక బద్ధంగా చదివితే ఉత్తీర్ణత సాధించుటకు కష్టమైన పని కాదని, ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులకు ఇచ్చిన వందరోజుల ప్రణాళికలను ఫాలో అవుతూ ప్రిపరేషన్ కొనసాగించాలని ఉంగుటూరు ఎంపీడీవో జిఆర్ మనోజ్ 10వ తరగతి విద్యార్థులకు సూచించారు. మంగళవారం సాయంత్రం బాదంపూడి జిల్లా పరిషత్ హైస్కూల్ని సందర్శించి పిల్లలతో సంభాషించారు.