ప్రకాశం: కంభం మండలం రావిపాడుకు చెందిన ఆర్మీ జవాను వరికుంట్ల సుబ్బయ్య సోమవారం బాంబు పేలుడులో మృతి చెందాడు. విధి నిర్వహణలో భాగంగా జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో సుబ్బయ్య పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అంతకు ముందు ఉగ్రవాదులు అమర్చిన మందు పాత్ర పై కాలు వేశాడు. బాంబు పేలడంతో ఆర్మీ జవాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.