డిసెంబరు 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య మూడో టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ తుది జట్టులో రెండు మార్పులు ఉంటాయని అంచనా వేశాడు. అశ్విన్, హర్షిత్ రాణాలను పక్కనపెట్టి వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణలను తుది జట్టులోకి తీసుకుంటారని తెలిపాడు.