త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ఎన్నికల్లో పోటీకి వ్యూహప్రతివ్యూహాలు సాగిస్తున్నాయి. తాజాగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్థానికంగా పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దేశ రాజధానిలోని ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల బీమా, వారి కుమార్తెల వివాహానికి రూ.లక్ష సాయం వంటి హామీలను ప్రకటించారు. కాగా, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఇప్పటివరకు 31 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.