హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూప్రకంపనలకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.3గా నమోదైంది. దీని కేంద్రం భూమికి 5 కిలోమీటర్ల దిగువన ఉంది. తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో చాలామంది గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండి నగరాన్ని భూకంపం తాకింది. మూడుసార్లు ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది.