జనసేనాని పవన్ ఇప్పుడు… అధికార పార్టీకి మంచి టాపిక్ గా మారారు. ఒకరి తర్వాత మరొకరు పవన్ ఫై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా విశాఖ గర్జన తర్వాత ఈ విమర్శల తాకిడి మరింత ఎక్కువగా మారింది. తాజాగా.. పవన్ కల్యాణ్(pawan kalyan) పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(perni nani) విమర్శలు గుప్పించారు.
3 పెళ్లిళ్లు చేసుకుని నీతులు, సూక్తులు చెబుతారా? అంటూ ఆయన పవన్ పై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడా? లేక ఫ్యాక్షన్ ముఠా నడుపుతున్నారా? అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.షూటింగ్ గ్యాప్‌లో పవన్ విశాఖకు వెళ్లారని. విశాఖ నుంచి కదలనని పట్టుపట్టిన ఆయన మళ్లీ ఎందుకు వెళ్లిపోయారు అని ప్రశ్నించారు. విలువలు, నిబద్ధత లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని పేర్ని నాని దుయ్యబట్టారు.
‘‘మీ కార్యక్రమాన్ని మేం ఆపలేదు, టీవీల నిండా, పేపర్ల నిండా వార్తలు కావాలి. మళ్లి రేపటి నుండి షూటింగ్‌లకు వెళ్లిపోవాలి. పవన్‌కు 3 రోజులు షూటింగ్లో ఖాళీ దొరికింది. అందుకే వైజాగ్ వచ్చాడు ’’ అని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘పవన్ కళ్యాణ్ ఒక్క మాట మీద ఎప్పుడూ నిలపడడు. చంద్రబాబుకు ఒక శాపం ఉంది. ఆయన నోట నిజం వస్తే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందని.. అలాగే పవన్ కల్యాణ్‌కు మాట మీద నిలబడితే అదే శాపం ఇతనికి ఉందేమో’’ అంటూ పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘‘మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండి అంటున్నావు. నువ్వు చెడిపోయావ్ కాబట్టి అందరూ చెడిపోవాలని కోరుకుంటున్నావ్. మూడు కాకపోతే ముప్పయ్ పెళ్లిళ్లు చేసుకో. భరణం ఇస్తున్నావ్.. కాకపోతే నీతి సూక్తులు చెప్పేటప్పుడు ఇలాంటి తప్పులు చేయకూడదు’’ని పవన్‌ను ఉద్దేశించి పేర్ని నాని హితవు పలికారు.