ఇరానీ గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేయటానికి వెళ్లిన పోలీసులపై రాళ్లు రువ్విన ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో ముంబై పోలీస్ అధికారి గాయపడ్డారు. ఇరానీ గ్యాంగ్ సభ్యులు చైన్ స్నాచింగ్‌లతో పాటు పలు నేరాలకు పాల్పడ్డారు. వారిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు అంబివ్లీ ప్రాంతానికి వెళ్లగా.. వారిపై పలువురు గ్యాంగ్ సభ్యులు రాళ్లు విసిరారు. రాళ్లదాడికి పాల్పడిన వారిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.