KMR: కాంట్రాక్ట్ ఫార్మసిస్ట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి పట్టణంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని భూపుత్రమ్మ కల్యాణ మండపం వద్ద నివసించే శిరీష(28) బిచ్కుందలో కాంటాక్ట్ ఫార్మసిస్ట్‌గా పని చేస్తోంది. ఆమెకు ఏడేళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆత్మ హత్యకు గల కారణాలు తెలియాల్సివుంది.