ATP: అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు గురువారం కళ్యాణదుర్గం అర్బన్ పోలీసుల సీఐ యువరాజ్ ఆధ్వర్యంలో దాడుల్లో 192 కర్నాటక మద్యం టెట్రా పాకెట్లు స్వాధీనం చేసుకొని ఓబుళేసు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ చర్యలు అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు చేపట్టారు. అదుపులో ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.