బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మొదటి మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో.. కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా దిగాడు. దీంతో అతను సక్సెస్ కావడంతో.. రోహిత్ బ్యాటింగ్ స్థానంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన రోహిత్ శర్మ.. రాహుల్ ఓపెనర్‌గా వస్తాడని.. తాను మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తానని వెల్లడించాడు. బ్యాటర్‌గా ఇది తనకు అంత ఈజీ కాదని.. కానీ, జట్టుకు ఇదే బెస్ట్ ఆప్షన్ అని అన్నాడు.